గోథే రాసిన ఫాస్ట్ విషాద నాటకం 2భాగాలు జర్మన్ భాషకే అలంకారాలు.ప్రేక్షకుల తో కిటకిట లాడిన రంగస్థలాల కాలమది. డాక్టర్ ఫాస్ట్ డెవిల్ మధ్య సాగిన కథ .ఆరోజుల్లో జనాల్ని విపరీతంగా ఆకర్షించిన జర్మన్ నాటకం.రష్యన్ రచయిత అలెక్సీ పెష్కోవ్ పేరు అంతగా తెలీదు.కానీ మాక్సింగోర్కీ అనే కలంపేరుతో రాసిన ఆయన నవల*మదర్* దాదాపు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదింపబడి జనాలజేజేలు నీరాజనాలు అందుకుంది.ఆయన నవలలు,నాటకాలు,జీవిత చరిత్ర ఆనాటి రష్యన్ జీవితంకి దేశకాల పరిస్థితులకు దర్పణం."లోయర్ డెప్త్స్, మైఛైల్డ్ హుడ్ అండ్ రెమినిసెన్సెస్ మొదలైనవి ముఖ్య రచనలు.దిథౌజెండ్ అండ్ వన్ నైట్స్ అరబిక్ కథలు ఆంగ్లంలో అరేబియన్నైట్స్ గా ఇప్పటికీ అలరిస్తున్న కథల సమాహారం.షాహ్రియార్ రాజు భార్య తో విసిగి ఉరిశిక్ష విధించాడు. ఆడాళ్లంటే అసహ్యం కోపం పెంచుకుని రోజుకో పెళ్లి ఆవధువుని తెల్లవారగానే చంపటం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అతని సలహాదారు కూతురు షెహరాజాదే తెలివి చాకచక్యంగలయువతి. అతన్ని పెళ్లాడి రోజూ రాత్రిపూట ఓకథ చెప్పేది.సరిగ్గా తెల్లారుఝామున మాంఛి సస్పెన్స్ లో ఠక్కున ఆకథను మధ్య లో ఆపేది.
ఆసస్పెన్స్ కోసం ఆమెను ఉరితీయకుండా ఆగాడు. అలా కథల సాలెగూటిలో ఇరికించి రాజుని మెప్పించిన సుదతి కథలే అరేబియన్ నైట్స్ గా నేటికీ అలరిస్తున్నాయి.ఆలీబాబా 40దొంగలు సింద్ బాద్,అల్లాఉద్దీన్ మాజిక్ లాంప్ సినిమాలుగా వచ్చాయి.1884లో సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ ఆంగ్లంలో అనువదించటంతో ప్రపంచప్రఖ్యాతి నొందాయి🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి