దేవకికి పుట్టిన 6గురు పిల్లలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 దేవకి వసుదేవుల పెళ్లి ఘనంగా జరిగింది.కంసుడు స్వయంగా రథాన్ని నడుపుతున్నాడు ఆకొత్త దంపతులను దిగబెట్టడానికి. అప్పుడు అశరీర ఆకాశవాణి అంటుంది" నీ చెల్లికి పుట్టేవాడు నిన్ను చంపుతాడు అప్పుడు కంసుడు దేవకిని చంపబోతా డు కానీ వసుదేవుడు ఇలా నచ్చచెప్పుతాడు బావ మేమిద్దరం నూతన వధూవరులం జీవులు ఒక జన్మలో నుంచి  ఇంకోజన్మలోకి గొంగళి పురుగు లాగా పాపుతారు కాబట్టి ఈ చెల్లిని చంపకు కానీ గట్టి గోడలో మేకు దిగదు.అలాగే మూర్ఖుడైన కంసుడు వినడు. వసుదేవుడు తెలివిగా భార్యను కాపాడటానికి కంసునికి ఇలా చెప్పాడు నిన్ను చంపేవాడు ఎనిమిదవ వాడు నీకు నమ్మకం కలగటం కోసం నేను పుట్టిన ఆరుగురు కొడుకులను నీకు అప్ప చెప్తాను వారిని నీవు చంపు". ఈ ఆరుగురు పూర్వజన్మలో ఒక పాపం చేశారు ఇది దేవీ భాగవతంలో ఉన్న కథ మరిచి ఆయన భార్య ఊర్మాదేవికి ఆరుగురు కొడుకులు పుట్టారు బ్రహ్మ సభకి వెళ్లి అనవసరంగా నవ్వారు అప్పుడు బ్రహ్మ వారిని రాక్షసుల కడుపున పుట్టండి అని శపించాడు అలా వారు కాలనేని కొడుకులు గా పుట్టారు కంసుడు పూర్వజన్మలో కాల నేమి అందుకే తన కడుపున పుట్టిన ఆరుగురు కొడుకులను తనే చంపాడు వీరంతా నిద్రపోతుండగా చంపబడ్డారు ఆపై బ్రహ్మజ్ఞానంతో మోక్షం పొందాడు ఇక్కడ ఆనాటి ఋషులు గర్భవతి శరీర నీ మనసుని చక్కగా తేట చల్లని చేశారు దేవకీ గర్భంలోని పిండాన్ని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది మహామాయ ఆ ఆ రోహిణి కొడుకు బలరాముడు రోహిణి వసుదేవుని పెద్ద భార్య ఆమె యశోద నందుల ఇంట ఉంది బలరాముడికి సంకర్షణుడు అని పేరు దేవకి పొట్టలోంచి రోహిణి గర్భంలోకి ప్రవేశించాడు కాబట్టి ఆ పేరు వచ్చింది ఇక పోతన గర్భిణీ స్త్రీ యొక్క వర్ణన దైవపరంగా చేసాడు ఆమె శరీరం పొట్ట పెరుగుతుందని భారంగా ఊపిరి తీస్తుందని చమటలు పడతాయని మట్టి తినాలని ఆశపడుతుంది అని వర్ణించాడు అంటే పంచభూతాలు శ్రీకృష్ణ జననానికి ముందు దేవకిని అలా సేవించాయి అని పోతన అద్భుతంగా తన భాగవతంలో వర్ణించాడు🌷
కామెంట్‌లు