మా అమ్మంటే
నాకెందుకిష్టమంటే
నేను నవ్వితే నవ్వింది
నేనేడ్చితే విలవిలలాడింది
నాకోసం తానెన్నో
బాధలనుభవించింది
తానేన్నో నిద్రలేని రాత్రులు గడిపింది
ఇప్పుడు నేనెంత గొప్పడినైనా
నన్ను చిన్నా
అని పిలుస్తుంది
నేను మా అమ్మ ఉన్నంతవరకే గదా
నా పసితనం గుర్తుకొచ్చేది
నాకు గుర్తు చేసేది
నా పిల్లలు ముందు కూడా
నేను నా పిల్లలు తింటే చాలను కుంటాను
మా అమ్మ నా కొడుకును తిననివ్వండి అని
నా పిల్లలను గట్టిగా మందలిస్తుంది
మా అమ్మ ఇప్పుడు
ఏమి మాట్లాడలేని
నిస్సహాయురాలిగా
నిస్తేజంగా..
అమాయకంగా నా వంకే చూస్తుంది.
మా అమ్మను ఇప్పుడు
నేను అపురూపంగా చూసుకోవాలసిన పసిపాప మా అమ్మ
నా బాల్యం మా అమ్మ వార్ధక్యంలో
చూస్తున్నా
ఎందుకంటే వృద్ధాప్యం అంటే ఎవరికైనా రెండవబాల్యమేకదా
అమ్మ ఇచ్చినదిజన్మ
అమ్మ ఇచ్చిందే ఈ హోదా
అమ్మ పంచినవే కదా
నా ఈ రక్తమాంసములు
అమ్మే నా చిరునామా
అమ్మే నా ఆనందం
అమ్మే నా మేరునగం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి