అమ్మ లేని ఇల్లు
పట్టపగలైన చిమ్మ చీకటే...?
అమ్మ లేని ఇల్లు దేవుడే లేని
దేవాలయమే.....
అమ్మ తిరుగాడిన నేలంతా
అమ్మ పాదముద్రలే ....
అమ్మ ఇకలేరు
ఇకరారు అన్న ఊహే....
ఊపిరితోడేసినట్టుగాఉంది
అమ్మ ఊరెళ్ళిందని
నన్ను బుజ్జగిస్తుంది నా ...మనస్సు
అమ్మా ...నువ్వు పంచిన ఈరక్తమాంసాలు ...
నువ్వు పంచిన ప్రేమాభిమానాలు...
నాకిప్పుడెవరు చూపగలరమ్మా....
నేనేడ్చితే నన్ను ఓదార్చి బుజ్జగించేవారెవరమ్మా...
నేను చేసే ప్రతి పని ఎంతో శ్రద్ధతో చేసేలా...
నన్ను ప్రోత్సహించేదానివే ...
నేను విజయం సాధించినప్పుడు
నువ్వే సాధించినట్టు
తాదాత్మ్యం చెందే దానవే...
అమ్మ నాలో నిస్తేజం కమ్ముకుంది
ఆ పాపకారి దేవుడు బిడ్డకు తల్లిని
దూరం చేసి పాపమే... మూటకట్టుకొనే ఉంటాడు...
అమ్మా.. నువ్వే వైపు వెళ్లావో...
ఆవైపు ఒకసారి చూపమ్మా...
నిన్ను కలిసి
నా హృదయవేదనంతా...
నీ ఒడిలోతలవాల్చిచెబుతానమ్మా...
కొండంత దుఃఖాన్ని దూరం చేసేపరమౌషధం నీ మాటలో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి