సుభాషితాలు :- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
కొరగాని కొడుకుతో
కొంపకు చేటుగదా?
వేరుపురుగుచేరి
వృక్షాన్నేచెరచెగదా?

మంచివాడిస్నేహం
మంచి పాలతీరు
చెడ్డవారిస్నేహం
బొగ్గు పాలతీరు

జన్మనిచ్చిన
తల్లి దండ్రులంటే?
ఏవగింపు చూపి
రేపు నువ్వు తల్లిదండ్రైతే
తెలిసేనా ?కొడుకులతీరు?
నువ్వు చూపినతోవ
నీ కొడుకు నడిచెగా?
నువ్వు క్షమించమని
కోరుటకు నీ తల్లిదండ్రి
శివైక్యం

తప్పు చేయనోడు
లేడుగద? జగతిలో
తప్పు దిద్దనోడే
నిజమైన దోషిగదా?

యత్నదోషపద్దతి
అన్నింటామేలౌనా?
ఏమి తెలియనపుడు
యత్నదోషమునెంచు
తెలిసితప్పుచేయుట
తెలివిలేనితనమౌను?


కామెంట్‌లు