చావాలి చావాలి :- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
రోగుల శరీరాల మీద వ్యాపారం చేసే 
దోపిడీ వైద్యులు చావాలి చావాలి

విద్యను విపణి సరుకును చేసి అమ్మే 
విద్యావ్యాపారులు చావాలి చావాలి 

నల్ల కోటు మాటున అన్యాయాన్ని న్యాయంగా
 రుజువు పరిచి తిమ్మిని బమ్మిచేయు 
దోపిడీ వకీల్లు చావాలి చావాలి 

పంచభూతాలను విషతుల్యం చేసి ఫిల్టర్ అంటూ నమ్మబలికి 
కనీస సౌకర్యాలన్ని కాసులకు అమ్మే దోపిడీ దొంగలు చావాలి చావాలి 

నకిలీ మందులను , నకిలీ సరుకులను 
ఆన్లైన్ మార్కెట్లోకి విడుదల చేసే బడాచోరులు

 అంతుచిక్కని రోగమోచ్చిఇప్పుడే చావాలి చావాలి

ఇటూ పౌరసమాజం అటూ ప్రభుత్వం స్వచ్ఛంద కార్యకర్తలై
ఈ తీరుగా జరిగే దోపిడీని
సమూలంగా నిర్మూలించాలి

కామెంట్‌లు