:ఆ వేదనే వర్ణనా తీతం..!!-బచ్చుప్రభాకరరావు-కోడూరు-9666723693
 సాహితీ కవి కళా పీఠం..!
సాహితీ కెరటాలు
================
విరహ వేదన.. ఎంతైనా
వర్ణనాతీతం..తట్టుకోలేనిది..
మది గుట్టువిప్పుకోలేని.. తియ్యని బాధ
ఇటు చూసినా.. అటు చూసినా..ఎటుచూసినాచెలికాడే..
దగ్గరకెళితే నాకు కానరాడాయే.. 
ఈ పండు వెన్నెలలో..
 నిండు జాబిలికి ఏమని
చెప్పను.. నా విరహ గీతిక
తనువంతా నీకోసం విరహంతో వేగిపోతున్నది
మనసంతా నీకోసం నిదుర రాక నిరీక్షించే
చన్నీటిస్నానమాచరించినా.. నావొళ్ళంతాసెగలాయే
విరులన్నీదుప్పటిలా కప్పుకుని.. విరి పాన్పు పై నీ కోసం పవళించినా..
విరహతాపం తీరదాయే..చెలికాడు కోసం
నీకోసం నా తనువు శృతిచేసిన వీణలా..
 రాగాలాపనకోసం తహతహ లాడుచుండే
భరించలేనిది.. విడువనంటోంది.. ఈ విరహం
********


కామెంట్‌లు