ప్రజా జీవితంతో ఆటలొద్దు:- కోలా సత్యనారాయణ - విశాఖపట్నం-: 9676623939
సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు
=============
సామాజిక మాధ్యమం ఒక
పదునైన సమాచార అస్త్రం.
సమాజం లోని కుళ్ళు, కుట్ర,
అన్యాయం, అక్రమాలు,
ప్రజల ముందుంచే చురుకైన,
నిష్పక్షపాత, నిజాయితీ అస్త్రం.

రాజకీయ, ఆర్ధిక, న్యాయ,
శాస్త్ర, సాంఘిక విషయాలను
నిష్కర్షగా వివరించే సాధనం.

నేడు మారింది దాని తీరు, తెన్ను.
తిమ్మిని బమ్మి చేస్తుంది.
లేనిది ఉన్నట్లు, ఉన్నది లేకుండా
చూపే మాయా మంత్ర దండం.

ఒకరి మోచేతి నీళ్ళు తాగి,
చెప్పినట్లు ఆడే తోలుబొమ్మ.
పరాధీన అయిన ఈ మీడియా
పనికొచ్చే పనులెట్లా చేయు?

ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి,
మీడియా పై ఆంక్షలు విధించే, 
నోటికి తాళం వేసే,కఠిన చట్టం
తేకుంటే,అగును లైఫ్ దుర్భరం.

కామెంట్‌లు