చిరస్మరణీయుడు సైనికుడు:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
దేశానికి రక్షకులు
మన ప్రియతమ సైనికులు
దేశ సరిహద్దుల్లో
భారతమ్మ కనురెప్పలు

జీవితమంతా త్యాగం
అదే వారికి సొంతం
అడుగడుగునా అవుతుంది
ఆదర్శమే జీవితం

వీర మరణమొందినా
అమరులే లోకంలో
జీవించే ఉంటారు
భారతమ్మ గుండెలో

వారి సమర్పణ గొప్పది
గౌరవిం

పదగినది
ఆచరింపదగినది
బహు అమూల్యమైనది

సైనికుడా! ధన్యుడవు
అందరికి స్ఫూర్తి దాతవు
భువిని చిరస్మరణీయుడవు
సైనికుడా! ఆరాధ్యుడా!

కామెంట్‌లు