నవ్వుల నదిలో సాగూ!:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
కాసంత చిరునవ్వులు
వదనానికి కడు అందం
పూసంత  మన మనసులు
పెనువేయును ఘన బంధం

సదనవనంలో నవ్వులు
పరిమళించు సిరిమల్లెలు
సొగసులీనే పువ్వులు
తీయగా మ్రోగు మువ్వలు

జీవితాన మధుమాసం
తెచ్చిపెట్టు దరహాసం
ఎందుకోయి! ఆలస్యం
కావాలోయ్! ఆరంభం

పైసా ఖర్చు లేనిది
ఉచితంగా వచ్చునది
జాగేల ఇక నేస్తమా!
నవ్వుల నదిలో సాగుమా!


కామెంట్‌లు