చిన్నారులు:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
దేవుడిచ్చిన బహుమతులు
చిన్నారులు ఇంటిలోన
ప్రకాశించే తారకలు
చూడంగా మింటిలోన

విరబూసిన కుసుమాలు
వారు సదనవనంలోన
కాంతులీను కాగడాలు
ఈ విశాల జగతిలోన

కళకళలాడును గృహములు
పసి పిల్లల సందడితో
చిందులేయును మనసులు
తీపి వారి పలుకులతో

రేపటి భారత పౌరులు
భారతమ్మ వారసులు
దేశభక్తి నేర్పిస్తే
వారే కదా సైనికులు


కామెంట్‌లు