సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
==============
విద్యే వెలుగు
వెలుగుతూ వెలిగించి దీపమై ప్రకాశించే విద్యే జ్ఞానం
జ్ఞానం లేకుంటే
అంధకార మయం జీవితం
విద్య అంటే బడిలో చదివే
పుస్తకాల బట్టీయం కాదు
కళశాలలు ఇచ్చే
కొలమానపు పత్రాలుకావు
అమ్మ ఉగ్గుపాలతో నేర్పేది
ఆశయాల సాధనకై వేసే
ఎల్లలు లేని అడుగులు
ఆకాశంలోని తారలలా చీకటిలోనూ అనుక్షణం వీడని పరిజ్ఞానమే విద్య
నాటి గురుకులాలోను బ్రతుకుతెరువుకై నేర్చే విద్యలు ఎన్నో
కోటి విద్యలు
విత్తమార్జనకే నేడు.
కాసులకైనా కళ్యాణానికైనా భువనానికైనా భోగానికేనా
మ్యాజిక్ చేసినా,
మ్యూజిక్ పాడినా,
కుండలు చేసినా కుర్చీలకు రంగలు వేసినా
అన్నీ వృత్తి విద్యలే...
అక్షరాభ్యాసంలో దిద్దిన అక్షరాలు బ్రతుకు చివరంటా మిగిలే గుప్త ధనము
విద్య నేర్చిన వారు మంచి గంధమై శోభించేను
విద్య అంటే సహనం
విద్య వుంటేనే రాజ పూజితం
విద్య అంటే సాంకేతికమైన జావా అయినా సంప్రదాయమైన సంగీతమైన
వినయ మెసగెడిదే విద్య
విదేశాన బంధువై వెంటవుండును
విద్య కీర్తి నిచ్చు రాజ పూజితము
విద్య నెరగని వాడు వింత పశువు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి