సుందర కాశ్మీరం నుదు టన రక్త సింధూరం....:-రెడ్డి రామ్...9908286792,కోడూరు

  తైలవర్ణ హిమ సుందర      దృశ్య వన కశ్మీరమా!
అతిశీతల పవనమాలికల నిలయ శిఖర సమూహమా!
మతోన్మాద ఛా యల్లేని
మతోగ్రవాద ఊ సెలేని
అఖండ భారత భూమి సాధనకై
సర్వసైనిక సాహసమే ఆ.సి.
ఉన్మాదుల పునాదులు
కూకటివేళ్లతో పెకలించి
పూరించిన సమర శంఖారవమే ...
దేశద్రోహ ముష్కరుల పీచం అణచగ కదనరంగాన 
సింహాలై గర్జించి విజృభించిన సైనిక యువ జవానులకు జోహరులు
పెనిమితిలేని పడతుల జీవితాన
సంతోషానందాలు దూరమైన నవ్వుల పూవుల
 పూయని నవ యవ్వన వనాన
నుదుటనసింధూరం కరువైన సమయాన, 
ఆవేశంతో ఆక్రోశించిన ఆడపడచుల ఆర్తనాదం
వెలగుండెల గుండెల ఘోష 
కోటి కంఠముల కంఠషోష 
యావత్విశ్వానికి వినిపించేలా
శతకోటికనులకు కనిపించేలా 
రణభూమికి ప్రణమిల్లిన
వీర నారి సైనికాధికారులకు
శిరస్సు వంచి సహస్ర అభివందనాలు అర్పిస్తూ...
విరచిత కవిత అంకితమిస్తూ...

కామెంట్‌లు