చిట్టి ఎలుక వాళ్ళమ్మ కోసం ఏడుస్తూ ఉంటే అది పిల్లని ఓదార్చి, " ఏడవకురా బాబూ! మనం ఇంట్లో ఉంటే వ్యాధులు వస్తాయి అని, బట్టలు కొరికేస్తామని వీళ్ళు బోన్ పెట్టారు గానీ, మంచి వాళ్ళు లాగే ఉన్నారు. నన్నూ బైట వదిలేస్తారు గానీ చంపరు. అదీ గాక మనం వినాయక దేవుడి వాహనం వంశం వాళ్ళము కదా. అందుకే చంపరు" అన్నది తల్లి ఎలుక.
"మరి, నువ్వు లేకుండా నేను ఇక్కడ ఎలా ఉండాలీ? "అని ఏడ్చింది పిల్ల.
"ఫర్వాలేదూ. నీకు దొరికిందే తింటూ ఉండు. కానీ ఇతర గదుల్లోకి మాత్రం వెళ్లకూ. బట్టలు కనిపిస్తే కొరికి పోగులు పెట్టకు. ఇంటి వారికి చాలా కోపం వస్తుంది. పళ్ళు దురద పెడితే ఓ స్పూన్ లాక్కు పోయి మూల చేరి కొరుకుతూ ఉండు. నువ్వు మరీ బక్కగా ఉన్నావు. కాస్త లావు అయితే అప్పుడు బైట పడొచ్చు. వీళ్ళు ఎప్పుడూ పెద్ద తలుపు వేసుకొని వుంటారు. నీకు ఇంకా కిటికీలెక్కేది రాలేదు. సమయం వచ్చినప్పుడు బైట పడడానికి ప్రయత్నం చేస్తే, నేనూ నీ కోసం రెస్టారెంట్ దగ్గర వేచి ఉంటా! ధైర్యంగా ఉందాం." అని తల్లి ఎలుక చెప్పింది.
ఉదయం లేవగానే పిల్లలు బోను లో చూసి "అమ్మా ఎలుక పడింది" అని చెప్పారు. ఇరుగుపొరుగు పిల్లలనీ తీసుకోని వచ్చి చూపించారు.
వాళ్ల తాతగారు ఓ గోతం సంచీ లో బోను పెట్టి బయటకి తీసుకోని వెళ్ళారు. కాస్త దూరంగా చెట్లలో బోన్ తలుపు తీస్తే ఎలుక పారి పోయింది.
ఇక పిల్ల ఎలుక రెండ్రోజులు తల్లీ కోసం ఏడ్చి, మళ్ళీ స్థలం మార్చి పెట్టిన టమాటాలు వెతుక్కుని తినడం మొదలు పెటింది.మధ్యాహ్నం వేళ కిచేన్ లో ఎవరూ లేనపుడు, పిల్ల అటూ ఇటూ పరిగెత్తి ఫ్రిజ్ కిందకి పోవడం చూసి, ఆ ఇంట్లో ఉన్న పెద్దామె జాలిపడి " ఏమిటో , తల్లీ బిడ్డా వేరై పోయాయి పాపం!" అనుకొని ఓ చిన్న బిస్కెట్, లేదా ఓ కరడు అన్నం అది ఉండే చోట వేస్తూ వచ్చిందీ.
చిన్నపిల్లలతో
"ఒరే, కిచెన్లో ఎలిక పిల్ల ఉంది, కొట్ట కండి. బైట కెళ్తే కాకులు పొడిచి చంపుతాయి. కాస్త లావు అయితే బోన్లో పడుతుంది. అపుడు వదిలేద్దాం!" అని చెప్పింది.
అంతలో ఒకరోజు ఓ కవర్ లో ఎండు చేపలు కనిపించి, సంతోషంగా రెండ్రోజులలో అవన్నీ తినేసింది చిట్టి ఎలుక.
అట్లా రెండు వారాలు గడిచాక, చిట్టి ఎలుక బాగా లావై ఆరోగ్యంగా వుంది.
అది బయటకెళ్ళే దానికి స్థలము మార్చి, పిల్లలు ఆడుకునే హాల్లో ఓ అట్ట పెట్టెలో పగలంతా నిద్రపోయి లేచాక తలుపు తీసారేమో చూస్తూ ఉంది. ఒకరోజు పాలాయన వచ్చి పాలు పోసి పోగానే, ఇంట్లో వాళ్ళు తలుపు వేసుకొనడం మరచి పోయారు.
"అమ్మ చెప్పినట్టు సమయం వచ్చినప్పుడు బైట పడడానికి ప్రయత్నం చేయాలి. జై గణేశా!'" అనుకుంటూ పిల్ల ఎలుక బయటకు తుర్రుమంది.
బయట కిందకి మెట్లు ఉన్నయి. గంతులేస్తూ చక చక మెట్లు దిగి బయట పడింది. మధ్యలో ఒకాయన మెట్లు ఎక్కుతూ చిట్టి ఎలుకని చూసాడు కానీ, వెళ్ళి పోతోంది కదా అని ఊరుకున్నాడు. కుక్కలు, పిల్లులు,పక్షులు దాడి చేయకుండా, ఓ చెట్టు నీడలో రాళ్ల మధ్య దాగి ఉంది.
రాత్రి అయ్యాక రోడ్డెక్కి, వీధుల్లో తిరుగుతూ రెస్టారెంట్ వెనుక భాగంలో చేరి," అమ్మా అమ్మా అని కిచ్ కీచ్" అని అరిచింది. అక్కడికి సమీపంలో వున్న దాని తల్లి పరుగున వచ్చి కొడుకుని కలుసుకుని , దైవానికి ధన్య వాదాలు చెప్పుకుని రెండూ చాలా సంతోషంగా ఉన్నాయి.!!
(సమాప్తం)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి