* విశ్వ మాన వీయత *:- కోరాడ నరసింహా రావు
నేను.. నేను... నేనే....
 నాది.. నాది... నాదే....

మన భాష..మానప్రాంతం...
  మనదేశం..మనము, మనది....!


ఎల్లలు చెరిపేసి ...పరిధులు దాటేసి...సంకుచితత్వాన్ని చించేసి...
  విశాల దృక్పథంతో...
   ఈ విశ్వమంతా ఒక ఇల్లుగా....
  ప్రపంచ జనులంతా ఓ కుటుంబం గా...చూడగలిగిన
  ఓ సమతా మూర్తీ...!
   నీవు కదా విశ్వ కవివి ...
    విశ్వకవివి నీవే కదా...!

కవిత్వానికి... సాహిత్యానికీ చక్కని నిర్వచనం నీ భావనా జగతి..!
   జన, గణ, మన జాతీయ గీత సృష్టి కర్తా...
కవిలోక కీర్తి కిరీటి...
    ఓ కవీంద్రా  ... రవీంద్రా!
   నీ కివే నా హృదయ పూర్వక పాదాభి వందనములు
💐🙏🌷🙏🎷🎺🎻🎼...

కామెంట్‌లు