క్షురకుడి నుంచీ ఓ పాఠం: - - యామిజాల జగదీశ్
 ఆయన ఓ సూఫీ జ్ఞాని. పేరు జునాయిద్ బాగ్దాది. ఆయన
"నేనొక రోజు ఓ క్షురకుడి నుండి ఓ పాఠం నేర్చుకున్నాను..." అని చెప్పారు.
ఒక రోజు, గురువుగారి మాటతో జునాయిద్ జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళారు. అయితే అప్పుడాయన దగ్గర డబ్బు లేదు. డబ్బుల్లేవన్న విషయం చెప్పి అల్లా కొరకు తన జుట్టు కత్తిరించమని అడిగారు. అప్పటికే ఒకదానికి జుట్టు కత్తిరిస్తున్న క్షురకుడు అతనికి చేయడం ఆపి జునాయిద్ కు జుత్తు కత్తిరించాడు. క్షురకుడి కళ్ళు తెలిసాయి. తన దగ్గర డబ్బులున్నప్పుడు తప్పకుండా ఇస్తానని అని బయటకు వచ్చేసారు.  సంవత్సరాలు గడిచాయి. 
ఈ క్రమంలో జునాయిద్ ప్రఖ్యాత సూఫీ సాధువుగా మారారు. 
ఒకరోజు ఆయన క్షురకుడి వద్దకు వెళ్ళి గతంలో తాను క్రాఫ్ చేయించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ కొంత డబ్బు ఇచ్చారు. 
అప్పుడా క్షురకుడు "అయ్యా, మీరు గొప్ప సూఫీ అయ్యారు. కానీ అల్లా నామం మీద చేసిన ఏ పనికైనా మనం ఎవరి నుంచీ ప్రతిఫలం కోరుకోమనే సంగతి మీకు తెలిసిందే కదా?" అంటూ డబ్బులు తిరస్కరించారు.

కామెంట్‌లు