# నేనిక లేనని తెలిశాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు
కానీ మిత్రమా! అదంతా నాకంట పడదు
ఆవిలాప మేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా!
# నీవు పంపించే పుష్పగుచ్చాలను
నా పార్థివ దేహం
ఎలా చూడగలదు అందుకే...
అవేవో ఇప్పుడే.... పంపరాదు!
# నా గురించి నాలుగు మాటలు
పలుకుతావు అప్పుడు
కానీ అవి నా చెవినపడవు
అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో!
# నేనంటు మిగిలిన నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు
కానీ నాకా సంగతి తెలియదు...
అదేదో ఇప్పుడే క్షమించేయ లేవా!
# నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది
కానీ అది నాకెలా తెలుస్తుంది
అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా
# నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది
అదేదో ఇప్పుడే గడపవచ్చు మనసారా
#సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు.... నా మరణ వార్త విన్నాక!
సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?
# ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకుతాను,
కాసేపైనా గడుపుతాను, హాయిగా నీతో మెలుగుతాను!
ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుతమైన కవిత అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం! కష్టసుఖాలు పంచుకుందాం ఒకరికొకరమై వెలుగుదాం ఉన్నన్నాళ్ళు కలిసిమెలిసి బతుకుదాం!
ఈరోజు కలిసి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో? మాట్లాడుతాడో లేదో?
ఏది శాశ్వతం?
ఎవరు నిశ్చలం?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి