నాడు...జపాన్ లోని
హిరోషిమా నాగసాకీలపై
అగ్రరాజ్యం అమెరికా కురిపించే
అణు బాంబుల అగ్ని వర్షం...
భూమిని మరుభూమిగా
మార్చిన అణుదాడి...
లక్షల కలలు బూడిదైన విధ్వంసం...
నేడు...
సోఫియా ఖురేషి...
వ్యోమికా సింగ్ నేతృత్వంలో
చిమ్మచీకటిలో దట్టమైన అడవుల్లో
పాక్ ఉగ్రవాద శిభిరాలపై
ఉక్కుపాదం మోపిన భారత్...
కాశ్మీరు కొండలపైకి దూసుకెళ్లి...
పాముల పుట్టల్లోకి దూరి...
"ఆపరేషన్ సింధూర్"...పేర
"జీహాద్ పేర జీవహింసకు"
యువతను ఉసిగొల్పే ఉగ్రనేతల్ని
పహల్గామ్ పై దాడికి తెగబడ్డ
ముష్కర మూకల్ని మట్టుపెట్టిన
"వీర వనితల విజయ గాధ"...
27 నిమిషాల్లో...
9 ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసి...
100 మంది ముష్కరులకు తీర్పు తీర్చి
తిరిగి వచ్చి త్రివర్ణ పతాకాన్ని ముద్దాడి
వారి రక్తంతో...భర్తల్ని కోల్పోయిన
26 మంది మహిళల నుదుట...
బైసరిన్ లోయలో ఉగ్రవాద దాడికి
తల్లడిల్లిన తల్లి భరతమాత నుదుట...
దిద్దారు ఇద్దరు "రక్తసింధూరం"
ఇది పహల్గామ్ దాడికి భారత్ "ప్రతీకారం"
ఆ ఇద్దరు భరతమాత ముద్దుబిడ్డలు...
చీకటి అడవిలో మెరిసి వెలుగు రేఖలు...
విశ్వవిజేతలుగా నిలిచిన వీర వినితలు...
అందుకే...తమ ప్రాణాలను
ఫణంగా పెట్టిన ఆ స్త్రీల సంకల్పానికి...
సాహసంతో చేసిన వీరోచిత పోరాటానికి...
జయహో జయహో సోఫియా ఖురేషి...
జయహో జయహో వ్యోమికా సింగ్...
అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిద్దాం..!
చేతులు జోడించి మొక్కి..సెల్యూట్ చేద్దాం.!
జై హింద్...! జై భారత్...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి