మహాభారతయుద్ధానంతరం కృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. అప్పుడు రుక్మిణి అడిగింది...
గురువు ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు వంటివారిని హతమార్చిన వారికి మీరెందుకు సహకరించారు అని.
అప్పుడు కృష్ణుడు నువ్వు అడుగుతున్న ప్రశ్న సముచితమే. అందులో ఎటువంటి అనుమానమూ లేదు. ఇద్దరూ జీవింతాంతమూ నీతికి కట్టుబడి జీవించినవార. కాదనను. కానీ వారిద్దరూ ఒక తప్పు చేసారు. అది వారి ప్రాణాలు తీసింది. అన్నాడు.
ఏమిటా తప్పు అని అడిగింది రుక్మిణి.
ఇద్దరూ పెద్దవాళ్ళు. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఇద్దరూ సభలో ఉన్నారు.
పెద్దవాళ్ళుగా ఇద్దరూ ఆ చర్యను ఆపి ఉండొచ్చు. కానీ వారిద్దరూ ఆ పని చేయలేదు. ఈ ఒక్క తప్పూ వారిని నాశనం చేసిందన్నాడు కృష్ణుడు.
మరి కర్ణుడి సంగతి ఏమిటి అని అడిగింది రుక్మిణి.
అతను దానానికి మారు పేరు. అతని దగ్గరకు వచ్చిన వారవెరూ రిక్త హస్తాలతో వెనుతిరిగింది లేదు. అటువంటి కర్ణుడు చేసిన తప్పేమిటీ అని అడిగింది రుక్మిణి.
కృష్ణుడు చెప్పాడు ...
నువ్వన్నదాంట్లో ఆవగింజంత తప్పు లేదు. నిజమున్నర నిజం. అతనెవరికీ లేదని చెప్పలేదు. కానీ ఏం లాభం....ఎందరితోనో వీరోచితంగా పోరాడిన అభిమన్యుడు నేల కూలి దాహం అని అడుగుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు కర్ణుడు. అతను నిల్చున్న సమీపంలోనే మంచి నీరు ఉన్నప్పటికీ నీరివ్వలేదు. తన మిత్రుడయిన దుర్యోధనుడిని బాధ పెట్టే పని చేయడం ఇష్టంలేక కర్ణుడు అభిమన్యుడికి నీరివ్వలేదు. దాంతో అతను అప్పటి వరకూ చేసిన దానాలన్నీ వృధా అయిపోయాయి. అనంతరం యుద్ధంలో అదే నీటి మడుగులో అతని రథ చక్రం ఇరుక్కుపోయి చంపబడ్డాడు అని కృష్ణుడు చెప్పాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి