దేశమును ప్రేమించాలి .:- ఎం వీర వెంకటరెడ్డి.
సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు. 
===============
స్వార్ధాన్ని వీడి,పునికి పుచ్చుకోవాలి దేశభక్తిని. 
దేశం కోసం అహర్నిశలు పాటుపడాలి 
చెమటోడ్చి, అభివృద్ధిలో ముందు ఉంచాలి. 
మానవత్వాన్ని కలిగి, సోదరభావాన్ని పెంపొందించుకోవాలి. 

దేశభక్తికి త్యాగనిరతి ఉండాలి 
బడుగు ప్రజల బ్రతుకు, మెండుగా ఉండాలి.
దేశమే ఊపిరై ,రక్తాన్ని ధార పోయాలి 
దేశాన్ని రక్షించుకోవాలి. 
దేశాన్ని అన్ని రంగాలలో, ముందు ఉంచాలి.

భరతమాత.. మన పుడమి తల్లి ,
నిన్ను గన్న కల్పవల్లి.
 మాతృభూమిలో విరబూసిన సుగంధమై మెలగాలి మనం. 
క్రమశిక్షణలో సుశిక్షితులమై, మెలగాలి. 

భరతమాత ముద్దుబిడ్డలమై, మంచి పనులు చేయాలి. 
శాస్త్ర సాంకేతిక రంగాలలో.. వైజ్ఞానిక- ప్రభల శక్తిగా భారతావని ఎదగాలి. 
ఆర్థిక అభివృద్ధి చెంది, ప్రపంచంలో ముందుండాలి..
భారత్ మాతాకీ జై.

కామెంట్‌లు