మా సంకల్పం సుస్పష్టం
దృక్పథం మారదు
స్పందనే సూటిగా తగులుతుంది.
చర్చలు చేసేది మూలాలు ఏరిపారేసినపుడే.
సహనం,సామర్థ్యం విశ్వానికి
చూపించాము.
శూన్య సహనమే ఉగ్రవాదానికి.
శుష్కహస్తాలే కుటిలవాజితనానికి.
దీక్ష,దక్షతలతో చెరగని ముద్రవేస్తాం.
ఐక్యతతో,అభివృద్ధితో అడుగులు ముందుకువేస్తాం.
వికసించిన భారతమే మా కర్తవ్యం.
సైన్యం,సంయమనం,
సమయస్ఫూర్తి,సాధికారత,
సార్వభౌమత్వమే మా విధానం.
మా దారి రహదారే.
మా పరాక్రమం పరిణితి చెందింది.
మా జనత మాకు గర్వకారణం.
త్రివిధ దళాలు మాకు పెట్టని కోటలు.
మెరుపుదాడులమై,
రణసిందూరాలమై ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాము.
భరతమాత వీరసంతానమై పుడుతూనే ఉంటాము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి