సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
============
అరమరికలు లేని ఆనందం
బాల్యానికే అది సొంతం
ఆహ్లాదకరమైన చిరునవ్వులు
బాల్యాన పూసేటి మరుమల్లెలు
పచ్చని ప్రకృతి ముంగిటన
ఎదిగే ఆశల సందిటన
ఒకరికొకరైన బాసటన
ఒదిగి ఉంటారు బాల్యాన
దైవం ఇచ్చిన కానుకలు
ఇంటింటికి వెలుగులు
విరబూసిన కలువలు
అరవిరిసిన ఆత్మీయతలు
గారాబాల చిరుగువ్వలు
ప్రేమ చిందించే మువ్వలు
అమ్మ నాన్న ల ప్రాణాలు
అనురాగ బంధాల వీచికలు
మోమూలు చూసి మురిసి
అమాయకత్వం కలగలిసి
జ్ఞాపకాలన్నీ పోగుచేసి
నేడు మరోమారు బాల్యం లోకి తొంగి చూసి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి