సాహితీ కెరటాలు
=============
బ్రహ్మ సృష్టిలో ,స్త్రీ పాత్ర సర్వోన్నతo
అమ్మ లేకపోతే గమనం లేదు సృష్టిలో జీవం లేదు
బ్రహ్మ అమ్మను,సృష్టించాడు
ఇల పై వెలసిన సృష్టికర్త.. మాత్రం అమ్మ.
కనుల ముందు కనిపించే , దేవత... అమ్మ.
రక్త మాంసాలిచ్చి పెంచిన, దేవత.
బుడిబుడి అడుగులు నేర్పిన, తొలి గురువు అయింది.
రెక్కలు ముక్కలుగా పని చేసుకొని..
బిడ్డకు, బంగారు భవితని ఇచ్చింది.
అమ్మను మించి దైవం ఉన్నదా!
అమ్మ కడుపున పుడతాo,..
కడుపు పగిలేటట్టు ఏడిపిస్తాo.
అమ్మకు,పట్టెడు అన్నం పెట్టలేని దీనస్థితి.
పిల్లల ఉన్నతికి నిత్యం శ్రమించే మాతృమూర్తి.
జీవితాంతం కష్టించే శ్రమజీవి.
భవితకు బంగారు బాటలు వేసే శక్తి స్వరూపిణి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి