సిందూర చైతన్యం :- డా. ఒజ్జల శరత్ బాబు
కంఠము గద్గదంబవగ గాత్రము హోమపు జ్వాలవన్నిటన్ 
కుంఠనమన్నదే కనము కుట్రలు లేవిట జెప్పి తుచ్ఛమౌ 
కంఠములన్ తెగన్నరికి కాకుల వేయగ వైరులెల్లయున్ 
లుంఠనమయ్యిరీగతిన  క్రూరులు పాపులు మీకిదే తగున్ 1

మీ సంతు పెంపుకై మ్లేచ్ఛబుద్ధులు మీరు  
         హైందవ వనితల బంధ మేల 
భూవిన యసురులు భూభక్షకులు మీరు  
          పుణ్య భారత మందు  పురుడు లేల 
వావివరుసలూసు పాడి శూన్యులు మీరు  
          కారుణ్య మనుజుల కలయికేల 
కల్ల కపటముతో ఖలులగుదురు  మీరు 
          వసుధైక భావనా వాస మేల 
  వీడు మీ యసహన హింస వేల్పు పేర 
  భరత భువి యెవ్వరికైన భాగ్య మిచ్చి
  నిలిపె లేదంటే కాల్చెను వంశ మెల్ల 
 మరొక కాళీయ మాహిషీ  మగువ యగుచు 2

వీరగంధమువారమండి యభీర జాతిది కాదులే
కారుకూతలనోరు లేదు స్వగమ్య మార్గము గీతయే 
ధీరలక్షణ మేటి వారము దేనికైనను సిద్ధమే 
పారు మూకల పోరునందు సవార్ధి యుప్పెన శౌర్యమే  3

చెండాడుట మా హక్కది 
నిండారు విషపు జిహాది నేతల విధమున్ 
దండుగ సహ'నమ్మిక' సరి 
గుండాడటమున జయమున గ్రుంకెను  భారతీ!  4

బెదురు తనమేల మాకని యెదను చీల్చి 
మూల వేరునొకింతను గూల వేసె 
జయము భారతీయ జవాను జయము జయము 
మనదు నాయక మార్గమే మనకు జయము 5
          

కామెంట్‌లు