అక్క చెల్లి కలిశారు
సర్వలు చేత పట్టారు
పారే వాగు కు వెళ్లారు
పక్కకు సెల్మెలు చేశారు
తెల్లగా పాత్రలు తోమారు
వాటికి వడబట్ట చుట్టారు
సెల్మెలో నీటిని ఎత్తారు
సర్వల నిండా నింపారు
చుట్ట బట్ట చుట్టారు
తల మీద పెట్టారు
నీటి బిందెలు ఎత్తారు
గబగబా ఇల్లు చేరారు
అమ్మ సర్వలు దించింది
నేల మీద పెట్టింది
చెంబు ఒక్కటి తెచ్చింది
అందరికి త్రాగే నీరిచ్చింది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి