హరివంశం! అచ్యుతుని రాజ్యశ్రీ

 హరి అంటే విష్ణువు,హరుడు అంటే శివుడు.ఇద్దరూ ఒకరే.మార్గాలు వేరైనా గమ్యం ఒకటే.హరివంశం ఉన్న పేరు ఖిలం. మహాభారతం అంటే భారతం హరివంశం కలిసినది అని అర్థం.భారత కథను మునులకు చెప్పిన వాడు ఉగ్రశ్రవసుడు. శ్రీకృష్ణుని వంశకథలను ఆయన చెప్పాడు.వేదవ్యాసుడు రాసిన  హరివంశంలో రెండు పర్వాలున్నాయి.భవిష్యపర్వంతో కల్పి 100పర్వాలున్నది మహాభారతం.దీన్ని ఆంధ్రీకరించినవారు కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ్య తిక్కన ఎర్రన ఎర్రన హరివంశ రచన చేశాడు పూర్వ ఉత్తర హరివంశం రాశాడు ఇంకా నాచన సోమన నేమాని భైరవ కవి హరివంశాన్ని రచించారు. ఇక భూమికి పృథ్వి అన్న పేరు ఎలా వచ్చిందంటే పృథుచక్రవర్తి ఆనతితో, ఆయన మాటను తు.చ.తప్పక పాటించి పృథ్వి అని పిల్వబడింది. మధుకైటభరాక్షసుల మేథస్సుతో నిండి మేదిని గా పిల్వబడింది. భూమికి ఉన్న పేర్లు తెలుసుకుందాము.వసుంధర, ధాత్రి,విధాత్రి,పావని.ఇక క్లుప్తంగా మనువుల పేర్లు తెల్సుకుందాం.తొలి మనువు స్వాయంభవుడు. రెండోవాడు స్వారోచిషుడు. మూడోవాని పేరు ఉత్తముడు.నాల్గవ వాడు తామసుడు.ఐదోవాడు రైవతుడు.  ఆరోవాడు చాక్షుషుడు. 7వవాడు వైవస్వతుడు. ఈయన కాలం ఇప్పడు నడుస్తోంది.🌹
కామెంట్‌లు