ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
కట్ట కట్టుకుని కష్టాలు
ఎన్ని క్లిష్ట పరిస్థితులొచ్చినా...
బ్రతుకు ఎంత కష్టంగా ఉన్నా
ఎన్ని అవాంతరాలొచ్చినా...
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా...
ఎవరు ఎంతగా వ్యతిరేకించినా...
ఎంతగా వెనక్కిలాగినా...
ఎంతగా విమర్శల విషం చిమ్మినా...
ఎన్ని నిందల నిప్పులు చెరిగినా...
సింహంలా ధైర్యంగా ఎదుర్కో...
సందేహించకు...
సమస్యలు
ఎదురయ్యాయని...
సతమతమైపోకు...
వెతలకు గురికాకు...
బలహీనతలకు బలికాకు...
వెనక్కి తిరిగి చూడకు...
వేదన చెందకు...
ఎవరిని
నిందించకు...
నిట్టూర్చకు...
నిరాశ పడకు...
అనుకున్న లక్ష్యాన్ని...
ఖచ్చితంగా సాధిస్తానన్న
దృఢనమ్మకాన్ని వదులుకోకు...
విజయం ముందు చింతల
చితిమంటల చిటపటలే...
అన్ని ఇక్కట్లే చిమ్మ చీకట్లే...
ఆ పై మ్రోగేది వేలాది చప్పట్లే...
కప్పేది సత్కారాల జరీ దుప్పట్లే...
నీ సాహసం నీ పట్టుదల నీ కసి నీకృషి
గురించి నీ ముందు వెనుక ముచ్చట్లే...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి