మట్టిని
చీల్చుకు పుట్టిన ప్రతి చెట్టు
ఒక సైనికుడు!!
తల్లి గర్భంలోంచి
బయటపడ్డ ప్రతి పసివాడు
ఒక సైనికుడు!!!
ఆవిరి మేఘమై
నదిగా మారిన ప్రతి నీటి చుక్క
ఒక యోధుడు!!
ఆకాశాన్ని చుట్టి
భూమిని తట్టిన ప్రతి కిరణం
ఒక వీర సైనికుడు!!
లే
పవనకుమారుడా
వనం తగలబడుతుంది!
జనం మండిపడుతుంది!!
అమ్మ ఆకాశం
అమ్మ మట్టి
అమ్మ అగ్ని
అమ్మ సముద్రం
అమ్మ గాలి
అమ్మపై యుద్ధమా!!!? వద్దు.!
ఆ దేశానికి
ఆదేశాలు జారీ చేయండి
అమ్మ కన్నది సైనికులనేనని -
తీవ్రవాదులను కాదని!!?
మాతృభూమిపై
భరతమాత జెండా ఎగురవేయండి
భూగోళంపై
శాంతి జెండా ఎగరనీయండి!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి