ప్రసిద్ధ సంస్కృత పండితుడు,తత్వవేత్త, రచయిత, అనువాదకుడు,యాత్రికుడు రాహుల్ సాంకృత్యాయన్ జీవితంగూర్చి విహంగావలోకనం చేద్దాం.ఆయనని గూర్చి దాదాపు అందరికీ తెలీని పరిస్థితి.అందుకే కొన్ని జీవిత ఘట్టాలు తెలిపే చిన్న ప్రయత్నం చేస్తాను.
నార్త్ ఇండియాలో ఓకుగ్రామంలో అక్షర జ్ఞానంలేని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మొలక. ఆయన పూర్వీకులు సంస్కృత పండితులు ఘనాపాటీలు .ఆంగ్ల అక్షరాలు రాని భాషతెలీని పురాతన సాంప్రదాయ భావాలు ఆదర్శాలు గల వంశంవారిది.
రాహుల్జీ ఉత్తర ప్రదేశ్ లో పండహ అనే పల్లెలో 9ఏప్రిల్ 1893 లో జన్మించారు.తల్లిదండ్రులు కులవంతి గోవర్ధన్ పాండే.కానీ తల్లితో పాటు అమ్మమ్మ గారింట్లోనే గారాబంగా పెరిగాడు. 10-12ఏళ్ల వయసులోనే తండ్రితో సన్నిహిత సంబంధం ఏర్పడింది.
రాహుల్ అసలుపేరు కేదారనాధ్. ఇక తాత గారు మహా స్ట్రిక్ట్! బైట తోటిపిల్లలతో ఆడుకోనిచ్చేవాడుకాదు. ఏబాల్యపు చేష్టలు అల్లరి ఆటపాటలు లేక గృహ నిర్బంధంలో పెరిగాడనే చెప్పొచ్చు.దెబ్బలు తగిలించు కుంటాడని, అల్లరివాడవుతాడని ఆతాతగారి భయం! కానీ బడి మైలుదూరంలో ఉండటంతో ఐదేళ్ల రాహుల్ ని మాష్టారి ఇంట్లో వదిలి సాయంత్రం తెచ్చేవారు తాత గారు.భోజనం ఆమాష్టారు ఇంట్లోనే! చదువు రాలేదు కానీ ఆచిన్నారి కుదురుగా కూచోటం నేర్చుకున్నాడు.
(సశేషం)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి