మనిషికి సృజనాత్మక, హడాత్మక హృదయం ఉండాలే గాని ఎన్నెన్నో అద్భుత సౌందర్యాత్మక కళాఖండాల్ని ప్రకృతి మనకు బహుకరించింది. ఈ కుసుమం ఎంత లావణ్యంగా ఉందో దీని సుమధుర పరిమళాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎలాంటి ఉదయమైనా ఒక క్షణం ఆ మధురానుభూతికి లోనవుతుంది. ప్రకృతి ప్రేమికులు, భావకులు, కళాత్మక హృదయులు ప్రత్యక్షంగా ఈ కుసుమాన్ని చూస్తే క్షణకాలం అద్విత అనుభూతికి లోను కాక తప్పదు. గులాబీ, మొగిలి, మల్లెపూల సంయుక్త పరిమళం విరివిగా గుబాలించడం అద్భుతం కాదంటారా! శతరేఖ పుప్పి, భారత సుమన్ మొదలగు పేర్లు గల ఈ పుష్పం వర్షాకాలంలో శీతల వాతావరణం లో ఉదయం పుష్పించి సాయంత్రం వరకు వాడిపోతుంది. ఇంటి ముందు పందిరికి అల్లుకొని సుకుమారంగా పెరుగుతుంది. తులసీకన్నా లక్ష్మీకరం శుభకరం గా భావిస్తారు. ఆయుర్వేదంలో ఈ పుష్పం, వంధ్యా స్త్రీలకు సంతానానికై ఇతర సాఫల్యాలు ఔషధాలతో వాడితే అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. కాంక్రీట్ జంగిల్ లో కమనీయ మొక్కని పెద్ద పూల కుండీలో ఎర్రమట్టి నింపి ఆధారాన్ని ఊతమిస్తే అల్లుకొని పైకి ఎదుగుతుంది. చూడటానికి చాలా అందంగా ఉండటమే కాదు. ఈ పుష్పం నీలిరంగులో ఉండి మధ్యలో శివలింగాకారం చుట్టూరా పంచపాండవుల వంటి ఐదు రేఖలు దాని చుట్టూరా భారతంలో కౌరవుల వంటి వందరేకులు ఇలా పువ్వులో సంతరించుకొని ఉంటాయి.
ఇలాంటి సౌందర్య రాసిన అద్భుత పుష్పాన్ని మనం చూడగలగటం ఎంతో అదృష్టం.
ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుత పుష్పం. :- తాటి కోల పద్మావతి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి