బాల్య మిత్రుడు సిరివెన్నెల జయంతి ఉత్సవాలలో పాల్గొన్న "అయ్యలసోమయాజుల"

  విశాఖపట్నం పౌరగ్రంధాలయం లో ప్రముఖ సాహితీ సంస్థ విశాఖ సాహితీ  ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి డెబ్బది జయంతి సందర్భంగా "సిరివెన్నెల  భావ  విశ్లేషణ తరంగణి"  కార్యక్రమంలో  కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి పాల్గొని తన చిన్ననాటి స్నేహితుడు సిరివెన్నెల తో గల అరవై ఏండ్ల అనుబంధం గురించి ప్రత్యేకంగా సామాజిక స్పృహ కలిగి, నిత్య సంఘర్షణ తో సగటు మధ్య తరగతి మనిషి  సమస్యలు ,ఆధ్యాత్మిక, సనాతన ధర్మ విషయాలు కలిగిన పాటలను వ్రాసి అనకాపల్లి నుంచి అందనంత ఎత్తుకు ఎదిగినా ఆప్యాయంగా పిలిచే 'భరణి ధరణిని వీడి వెళ్ళడం'   చాలా బాధాకరమని తెలుగు పాటకే వన్నెతెచ్చిన సీతారామశాస్త్రి పాట ఉన్నంత వరకు చిరస్మరణీయుడేనని, సిరివెన్నెల లేనిలోటు తెలుగుప్రజలకు ముఖ్యంగా తనకు తీరని లోటని వారి పాట "ఎప్పుడూ ఒప్పుకో వద్దురా ఓటమి" అన్నది నిజంగా ఆచరించిన  ఉన్నత వ్యక్తని ఆర్ద్రతతో చెప్పారు
సభకు  అధ్యక్షత డాక్టర్ కందాళ కనకమహాలక్ష్మి, గౌరవ అతిధి ప్రముఖ సాహితీవేత్త  డాక్టర్ దామెర వెంకట సూర్యారావు, ,నంది పురస్కార గ్రహీత తిరుమల బ్రహ్మోత్సవ వ్యాఖ్యాత ,ముఖ్య అతిధి  సిరివెన్నెల గురువు శ్రీ వై. సత్యారావు మాష్టారు   మరియు అనేక మంది సాహితీ వేత్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.  కార్యక్రమాన్ని ఆద్యంతం విశాఖ సాహితీ కార్యదర్శి శంకర్ నీలు భాగవతుల పర్యవేక్షణ లో దిగ్విజయంగా జరిగింది.
...............................
కామెంట్‌లు