(కథానిక రెండో భాగం)
అట్లా పదిరోజులు గడిచాయి. స్థానిక ఎలుకలు, పందికొక్కులు కొన్ని వీటిని చూసి, రౌడీల్లా దౌర్జన్యం చేసేయి. దాంతో భయపడి అవి లేని సమయంలో మాత్రమే ఆహారం వెతుక్కోవలిసి వచ్చింది.
అంతలో వేసవికాలము వచ్చింది. సెలవులు అని కొన్ని కుటుంబాలు ఊర్లకి వెళ్ళి పోయారనీ, రెస్టారెంట్ లో బేరాలు లేవని యజమాని కూడా మూసేసి ఊరు వెళ్ళాడు.
దాంతో చిట్టి ఎలుక , వాళ్ళమ్మ ఆకలికి తాళలేక రాత్రిళ్ళు భవనాల కింద ఉన్న గొట్టాల ద్వారా పడే మెతుకులు తిని కాలము గడుపుతూ ఉన్నాయి. కానీ ఆకలి తీరడం లేదు.
ఓ రోజున ఓ గొట్టం ద్వారా తల్లి ఎలుక పైకి ఎక్కి ఓ ఇల్లు చూసి వచ్చింది. మనుషులు ఉన్నారు అని పిల్లని కూడా తీసుకోని పొయింది. వంటగదికి ఓ వైపు తలుపు లేదు. దాంతో రెండూ వంటింట్లో పాత సామాన్లు చాటున దాక్కుని ఉండి, రాత్రి కాగానే, బైట పడి తిరుగుతూ, కూరల బాస్కెట్లలో ఉన్న ఉల్లిపాయలు, టమాటాలు, ఆపిల్స్ అరటిపండ్లను కొరికి తినేస్తూ ఉన్నాయి. ఇంకా సింకులో పడిన వంట పాత్రల్లో అన్నం కూర ఏమైన కనిపిస్తే తింటూ ఉండేది తల్లి ఎలుక.
కొన్ని రోజులకి పగటిపూట కూడా అటు ఇటు పరిగెత్తడం పిల్లలు చూసి, "అమ్మా! ఎలుకలు!" అని అరిచి గోల చేశారు. దాంతో వాళ్ల నాన్న ఓ ఎలుక బోను తెచ్చిదాన్లో ఆపిల్ పండు ముక్క కొక్కికి తగిలించి పెట్టారు.
తల్లి ఎలుక బోన్లో కెళ్ళి ఆపిల్ని కొరకడంతో టపీ మని బోన్ తలుపు పడిపొయ్యింది. కమ్మగా ఉందనీ ఎలుక ఆపిల్ తింటూ గమనించలేదు. అంతలో చిట్టి ఎలుక ఏడుస్తూ వచ్చి బోన్ చుట్టూ తిరిగేసరికి, తాను బందీ అయినట్టు తెలుసుకుంది తల్లి ఎలుక.
(సశేషం)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి