చిట్టిపొట్టి బాలల కథలు-5
====================
" తలుపు తీస్తే చాలు కోతుల బెడద తప్పేలా లేదు. ఇది వరకూ మెస్ దగ్గర చెత్త ట్రాక్టర్లో కూరగాయలు గట్రా తినేసి వెళ్ళేవి. ఇపుడు వేసవి సెలవులు వచ్చాయి కదా, మెస్ మూతపడి, కోతులు ఆకల్తో అపార్ట్ మెంట్లలో బాల్కనీలమీద చేరి చెత్త బుట్ట కెలకడం మొదలెట్టాయి. తలుపు తీసుంటే లోపలకొచ్చేసి తినేవి ఏమైనా కనిపిస్తే ఎత్తుకు పోతూ ఉంటాయి! నిన్న పొద్దు పొడిచే టపుడు వత్తులు చేస్తూ ఉంటే మన కిట్టు ఎత్తున్న కోతి బాల్కనీలో నుండీ లోపలి కొచ్చేసి గుర్రు మంది. " వర్ధనమ్మ కోడలితో చెప్తూ ఉంటే విన్నారు పిల్లలు.
"అయ్యో. మరి కొట్టలేదా దాన్ని మీరూ? ఎలా వెళ్ళి పొయ్యింది? "అందీ శ్యామల.
"కొట్టడం చేస్తే మీద పడి రక్కుతాయి. చేతికి అందుబాటులో అరటి పండ్లు బుట్ట ఉంటే రెండు పళ్ళు విసిరా! తీసుకోని పోయింది. అసలే మంగళవారం. ఆంజనేయ స్వామి అవతారం!" నవ్వి చెంపలు వేసుకోవడం చూసి కోడలు కూడా నవ్వింది.
"అటువైపు కొన్ని పల్లెల్లో అయితే వందల కోతులు కొండల్లో ఆహారం దొరక్క ఊర్ల లో పడీ మొక్కజొన్న పంట, మామిడి, జామ తోటలు పాడు చేస్తాయిటా. పాపం ఆ రైతుల కష్టం వృథా!" శ్యామల అన్నది అత్తగారితో.
"ఊర్లలో కోతుల బెడద తప్పించే దానికి కొండముచ్చుల్ని తీసుకొచ్చి వదిలారట. పేపర్లో చూసా. వాటిని చూస్తే కోతులు పారిపోతాయి అమ్మగారూ!" పని మనిషి అన్నది.
"అమ్మా! కొండముచ్చు అంటే ఎలా ఉంటుందీ?" అడిగాడు కిట్టూ.
"కాస్త పెద్ద కోతిలా వుండి, ముఖం వేరేగా ఉంటుంది. "అంది శ్యామల.
సమ్మర్ స్పెషల్ క్లాసుల్లో బొమ్మలు గీసే దానికి వెళ్తూ, పెద్ద చార్టు, బ్లాక్ కలర్, స్నఫ్ కలర్ తీసుకోని వెళ్ళాడు కిట్టు.
తెల్లవారి బాల్కనీలో కొచ్చిన వర్ధనమ్మ ఉలిక్కిపడి, వెనక్కి అడుగు వేసి, తర్వాత నవ్వుకొని కోడలికి చెప్పి చూపింది. జీవకళ ఉట్టిపడుతూ పెద్ద కొండముచ్చు బొమ్మ నిలబెట్టి ఉంది. బొమ్మ కింద "కిట్టూ" అని సంతకం!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి