సాహితీ కవి కళాపీఠంసాహితీ కెరటాలు=============నిండు పున్నమి వేళ సరిగంచు సవరించే తెల్లచీర!ఈ పల్లెటూరి పిల్లనై సరదాగా పరుగులెట్టె గోదారి తరగలా!మనసునెరిగిన మమతలోన మునకలేసే బంధమై అల్లుకోనా!ఆ నింగిలోని తారకలా మెరిసిపోతూ కనిపించేనా!అలా కన్నె గోదారినై పరవళ్లు తొక్కుతూ కదిలే వేళ!ఆనంద సాగరంలో కలిసి తిరిగే సుడినైపోనా!బంధమై మిగిలిపోయి ప్రేమగా బంధీనైపోనా!?ఈ ఆశా పాశమై నిన్ను అలరించేనా!?నీతో చిన్నపిల్లనై అల్లరిగా ఆడుకోనా..!?నిశిలో ఉదయించే కిరణమై విరాజిల్లనా!?ఏమైపోయినా ఈ మల్లెల వానలో ఇలా..ఏం జరిగినా ఈ తెల్లని చీరలో అలా..ఎలాగైనా ఈ పల్లెటూరు గాలినై వీస్తూ..ఈ మమతానురాగాల నడుమమమతానుబంధమై నింగిలోని తారకలా..ఉండిపోతున్నా నీ జీవిత భాగస్వామినై...!
- ఈ పల్లెటూరి పిల్లనై..;- గాయత్రీభాస్కర్ -విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి