నీకన్నా-నా కన్నా-మనకన్నా
మెరుగైన వారి కోసమే
ప్రపంచం ఎదురుచూస్తుంది.!!?
మెరుగైన వ్యక్తులు దొరికితే
ఈ ప్రపంచం మనల్ని వదిలేస్తుంది.!!?
ఈ చూపు ఈ వినికిడి ఈ ఉనికి
ఈ ఊపిరి ఈ నడక ఈ పని
మెరుగైన శరీరం కోసమే వేచి ఉంది
అది దొరికితే మనల్ని వదిలేస్తుంది.!!?
ఇప్పుడు
పేదరికం అంటే- సాధారణం-!!
సంపద అంటే-అసాధారణం - అని అర్థం!!
సాధారణము అంతా
అదృశ్యమైపోతుంది.
చివరికి అసాధారణమే మిగులుతుంది.!!
ఇంతకుముందు
మెరుగైన దాన్ని ఎన్నుకునేది
ప్రకృతి
ఇప్పుడు
మనిషి మెరుగైన దాన్ని
ఎన్నుకుంటున్నాడు.!!
ఎన్నిక - మెరుగైన దానికోసమే అయినప్పుడు
మనమెందుకు ఇక్కడ!!?
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి