మేలుకో...!! : - కమలాపురం సాయిక్రిష్ణ గౌడ్- రైల్వే కోడూరు అన్నమయ్య (జిల్లా)
సాహితీ కవి కళాపీఠం*
 సాహితీ కెరటాలు 
==================

నా దేశ యువతరమా... 
కపట ప్రేమ మాయలో పడి
దాగుడు మూతలాడక మేలుకో... 
లే... కళ్ళు తెరువు కళ్ళు తెరిచి 
నిర్భయంగా చూడు... 
అమాంతంగా దూసుకోస్తున్న 
ఆ శత్రువు తూటాకి ఎదురెళ్లి 
రొమ్ము విరిచి నిలబడ్డ ఆ వీరుల 
సౌర్య పరాక్రమాలను చూడు... 
జూలు విదిలించి పంజాతో ఎగబడి 
ఒక్కొక్కరిగా ఏరి పారేస్తున్న 
ఆ వీరత్వాన్ని చూడు... 
నిత్యం నీలో రగిలే ఆ కాంక్షలను 
కట్టడి చేసి నీలోని పరాక్రమ వీరత్వాన్ని 
మేల్కొల్పు ఒక్కొక్కరు సంధించిన 
బాణమై కదన రంగంలో విరుచుకుపడాలి
ఫిరంగి వదిలిన తూటాలై ఎగసిపడాలి
ఉగ్రవాదుల చేతులో చితికిపోయిన
ఈ భరత భూమిని రక్షించుటనీ కర్తవ్యమని
గుర్తించు.. లే... పద... కదులు... 
యువతలో మార్పురావాలి... ఛైతన్యాన్ని నెలకొల్పాలి....!! 

కామెంట్‌లు