(అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం....!)
******
ఆహారాన్వేషణా సమూహాలనుండి...
పరస్పర సహకార సహజీవన స్థిర నివాసాలకు కుటుంబమే మూలం...!
స్త్రీ పురుషులిరువురూ ఒకరికి ఒకరుగా కట్టుబడి, సంతానోత్పత్తితో వారంతా ఒక్కటిగా ... సుఖ దుఃఖాలలో పరస్పరం హక్కులు,బాధ్యతలతో ఒక కుటుంబంగా ....!
ఇలా అనేక కుటుంబాలు..
పరస్పర సహకారంతో అనేక కుటుంబాలు ఒకచోట, గ్రామాలుగా....
ఇలా ఎన్నోగ్రామాలు పట్టణాలు , నగరాలు, మహానగరాలు..!
ఇంత మానవ సమాజ వికాసంలో... కుటుంబమే మూలం...!
ఒకటైన స్త్రీ , పురుషు లిరువురూ కన్న సంతతి యొక్క బాధ్యత కూడా ఈ ఇరువురిదే...!
కుటుంబ వికాసానికి మూలం పరస్పర ప్రేమానురాగాలు...!
సంతతిపై మమకారం !
మేము, మాది అనే భావన!
ఒకప్పుడు కుటుంబము అంటే భార్య, భర్త, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లు, అల్లుళ్ళు, మనుమలు,మనుమరాండ్రు...!
ఆ రోజుల్లో... ఉమ్మడికుంబాలతో....
వ్యవసాయమే ప్రధాన
జీవనోపాధిగా
అందరూకలిసిమెలిసి
ఆనందంగా బ్రతికే బ్రతుకులవి...!
మారిన కాలంతో పాటే....
ఈ యాంత్రిక యుగంలో
మనుషులూ యంత్రాల్లా మారిపోయి ఉద్యోగాల వెంట పరుగులు .....!
ఉమ్మడికుంబాలు విచ్చిన్నమై...
చిన్నకుటుంబాలకే పరిమితమైపోయిన దుస్థితి...!
ఆప్యాయతలు,అనురాగాలు మాయం...!
సాంఘిక సంబంధాలే కాదు రక్త సంబంధాలు సైతం ఆర్ధిక సంబంధాలు గా మారిపోయిన వైనం...!
డబ్బువెంట పరుగులతో...
కష్టానికి ,సుఖానికి..., కుటుంబానికి అందనంత దూరంలో ఏకాకి బ్రతుకులు...!
ఇల్లు వాకిలి , ఆస్తి పాస్తులు ... డబ్బుదస్కం ఎన్నున్నా , వృద్ధాప్యంలో
అనాధాశ్రమాల్లో బ్రతికే దౌర్భాగ్యం...!
ఇదా మానవ జీవన వికాస పరిణామం...!?
కుటుంబం పటిష్టంగా ఉన్నపుడే....గ్రామాలు, పట్టణాలు రాష్ట్రాలే కాదు...
మొత్తం దేశమే పటిష్టంగా ఉండేది...!
మొదట కుటుంబాలను పరిరక్షించుకోండి ...
దేశ పటిష్టతకు సహకరించండి ...!
విశిష్టమైన ఆరోగ్య కర కట్టుబాట్ల మన సనాతన సాంప్రదాయ కుటుంబ వ్యవస్థను బలపరచండి !
పరస్పర సహకార,ఆనందమయ జీవితాన్ని జీవించండి ..!
కుటుంబాలు వర్ధిల్లాలి...!
బలమైన దేశ నిర్మాణం జరగాలి...!
జై హింద్... జయ్ భారత్!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి