ఉదయగానం:-సి వసుంధర
మనం మాట్లాడుతుంటే
మల్లెలు కురిసినట్లు,
వెన్నెల రాలినట్లు
ఉండాలేకాని
ముళ్ళు గుచ్చినట్లు
సూదులు దించినట్లు
ఉండకూడదు.

సూక్తులు సూర్య కిరణాలవంటివి
అందుకే మనం అసూర్యంపస్యలుగా
 మిగలకూడదు.

మంచాలుండేది
పడుకోడానికి
ఇంట్లోవస్తువులకవి
వాహనాలు కావు

వ్యాసునికి మాల్స్
వాల్మికికి సినిమా హాల్స్ లేవు.కుక్షి నింపుకోడానికి
భిక్షనడిగి మనకు
సలక్షణమైన అక్షర
సంపదను సమకూర్చారు వారు.

మనకేం మంచిదో
మనమేతెలుసుకోవాలి
మహానుభావులు
నడిచిన త్రోవ అదే.
మన అనుభవాలే
మనకు గుణపాఠాలు.
పెద్దల మాటలే 
దరిచేర్చే దారులు.


కామెంట్‌లు