సిందూరం:- నన్నూరి రఘుపాల్ రెడ్డి

 సింధూరం ఒక బొట్టు కాదు - ఒక బలిదానం
 ఆ బొట్టు రంగు ఎరుపు కాదు - అది కన్నీటి రక్తపు మిశ్రమం
 నీ తలపై సింధూర బొట్టు- అది రక్తం గా మారకుండా చూడు 
 ఆపరేషన్ సిందూర్ అంటే ఒక సైనికుడి పేరు కాదు 
 తల్లి గర్భంలో మళ్లీ పుట్టే దేశభక్తికి రూపం 
 ఆపరేషన్ సింధూర్ అంటే పతకం
 గెలవడం కాదు
 దేశ పతాకం విజయగర్వంతో రెపరెపలాడడం 
 ఆపరేషన్ సింధూరం అంటే జీవితాన్ని విడిచిపెట్టిన వీరుడి సాహసం 
 సింధూర్ స్త్రీల మాంగల్యం గుర్తు - ఆపరేషన్ సిందూర్ దేశమాత మాంగళ్యబలం 
 ఆపరేషన్ సిందూర్ ఒక యుద్ధం కాదు ఒక జాతి పునర్జన్మ 
 అది ఒక బొట్టు కాదు రక్తంతో రాసిన జాతి గౌరవం
 బొట్టు కాదది బలిదాన రేఖ జాతిని నిలిపే జీవిత పీఠిక 
 సింధూర బొట్టు పడిన చోట వెలిసే ఓ దేవాలయం
 వీరుని రక్తమే జాతికి పునర్జన్మ అవతారం
 జై హింద్! జై భారత్!!.
=======================
 నన్నూరి రఘుపాల్ రెడ్డి 
 స్కూల్ అసిస్టెంట్( తెలుగు)
 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతంగి. మండలం చౌటుప్పల్
 జిల్లా యాదాద్రి భువనగిరి.
కామెంట్‌లు