అఖండ భారతం:- పార్లపల్లి నాగేశ్వరమ్మ - నెల్లూరు
సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు 
=============
 ఎప్పుడు అంత మవ్వాలి ఆధునిక వింత వితండపోకడల అంధకారాలు 
ఎప్పుడు వెదజల్లాలి సంప్రదాయాల జ్ఞాన జ్యోతుల పరిమళాలు

ఏమిటి మన దేశపు ప్రస్తుత పరిస్థితి 
ఏమిటి తెలుసుకున్నావా మన దేశపు పూర్వపుఘన స్థితి 

అలా పురాణాలను పుక్కిట పట్టిన వారే అందరూ అప్పుడు 
అలా అనుసరించే వారు కొందరే అయ్యారు ఇప్పుడు

ఎందుకు మరువాలి మన సనాతనాన్ని 
ఎందుకు మనం మరుస్తున్నాము మన మూలాల్ని

ఎక్కడ కనుమరుగవునో  మన ఘనమైన గతము
ఎక్కడ చేసుకుంటున్నాం మనం అవగతము 

మన చేతనవునుగాఆధ్యాత్మికతను చేయ సుస్థిరము 
నీ చేత చేయగలిగినంత చేస్తే అవుతుంది పదిలం 

రాముడు వలె పాటిద్దాం పితృ వాక్య పాలనం 
కృష్ణుడు వలె చేసేద్దాం, దుష్ట సంహారం


మన సాంప్రదాయాలకు ఎలా చెదలు పట్టిస్తాం
ఇతిహాస పురాణాలను ఎలా  వదిలేస్తా0

 ఎవరు ఏమన్నా ధర్మ భూమి మనది 
ఎవరు కాదన్నా పుణ్యభూమి మనది

ఇలా ఎంతకాలం మనలో గూడు కట్టిన అజ్ఞానం 
ఇలా ఉండుట కాదు సమంజసం ఆచరించి చూపితే మన చరిత్ర అవునుగాఘనం

కామెంట్‌లు