ధనంజయ మహారాజు కొలువులో కొత్తగా సంగీతాన్ని నేర్పే గురువు కావాలి అని ప్రకటన చేసినాడు. ఇంతకు ముందు తన రాజ్యంలో సంగీత విద్యార్థులకు సంగీతాన్ని నేర్పిన గురువు విజయుడు వ్యక్తిగత కారణాల వల్ల ఒక సంవత్సరం పాటు దూర ప్రాంతాలకు వెళ్లవలసి ఉన్నందున అతని స్థానంలో కొత్త గురువును నియమించాల్సిన అవసరం ఏర్పడినది.
చివరకు ఇద్దరు తాము గురువుగా ఉంటామని చాలామంది వచ్చారు. చివరకు ఇద్దరు ప్రతిభావంతులు పోటీకి మిగిలారు. వారి పేర్లు మోహనుడు, పార్థుడు. ధనంజయ మహారాజు స్వయంగా వారిద్దరినీ పరీక్షింపదలచాడు. "ఆ పరీక్ష రేపు ఉంటుంది. ఈలోపు మీకు వినోదాన్ని కలిగించేలా ఒక చిన్నారి సంగీతాన్ని మీకు వినిపిస్తాను. ఇంతకు ముందు ఉన్న సంగీత గురువు విజయుని శిక్షణలో ఆరి తేరిన చిన్నారి." అని అన్నారు మహారాజు ధనంజయ.
8 సంవత్సరాల అమ్మాయి శ్రుతి సంగీతాన్ని వినిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఆ సంగీతం. అది వింటూ ఆశ్చర్యపోయాడు పార్థుడు. అతని ముఖంలో తన్మయత్వం, సంతోషం గమనించాడు ధనంజయుడు. మోహనుడు ఆ చిన్నారి సంగీతాన్ని వింటూ ఈర్ష్యతో ముఖం మాడ్చుకున్నాడు. ఆ తర్వాత పార్థుడు ఆ అమ్మాయి సంగీతాన్ని బాగా మెచ్చుకున్నాడు. దగ్గరకు తీసుకుని ఆశీర్వదించాడు. మోహనుడు ఏమీ మాట్లాడలేదు.
మహారాజు పరీక్ష పూర్తి అయింది. గురువులో ఈర్ష్యా భావం ఉండకూడదు. కానీ మోహనునిలో అది గమనించాడు. పార్థుడిని గురువుగా ఎంపిక చేశారు మహారాజు. సంవత్సరం తర్వాత విజయుడు తిరిగి వచ్చినా అతనితో పాటు పార్థుడు కూడా గురువుగా కొనసాగుతాడు అని ప్రకటించారు ధనంజయుడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి