పల్లెవెలుగు బస్సెక్కిన బాబ్జీ, ‘ఎక్కడైనా ఖాళీ సీటు దొరకక పోతుందా’ అని అటూ యిటూ చూస్తున్నాడు.
వెనుక వరుసలో కూర్చున్న పెద్దాయన, ఇద్దరికి సరిపడా సీటులో కాళ్ళుబారజాపుకుని కూర్చున్నాడు. ఆయన పక్కన కూర్చుందామంటే, ఏ మాత్రం సహకరించేవాడిలా అనిపించలేదు బాబ్జీకి.
ఆయన ముందుకెళ్ళి నుంచుని, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. సర్దుకుని కాస్త చోటిస్తావా బాబాయ్! పొలిమేరలో దిగేస్తాను”అడిగాడు.
“సరే అబ్బాయ్! ఎలాగోలా సర్దుకుంటాగానీ, పొలిమేరలో దిగుతావుగా” అని చోటిచ్చాడు.
వెంటనే ఆ సీటులో సెటిలై వెనక్కి వాలి, గురక తియ్యటం మొదలు పెట్టాడు బాబ్జీ.
“అబ్బాయ్! పొలిమేర వచ్చింది దిగు” కదిపి లేపాడు పెద్దాయన.
“భలేవాడివి, మంచి నిద్ర పాడిచేశావు. లాస్ట్ స్టేజి అప్పుడే రాదు బాబాయ్!” గురక కంటిన్యూ చేశాడు బాబ్జీ.
*సమాప్తం*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి