-------------------------------------------------------
సామాన్యునిగానే జన్మించి
అసాధారణ ప్రజ్ఞా సాలిగా....!
వెండితెరపై విశ్వవిఖ్యాత నట సార్వభౌముడై...!
అశేష ఆంధ్ర ప్రజానీకమునే గాక....
ప్రపంచ కళా హృదయు లందరి హృదయాలలో
సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక వ్యక్తి ....
మన ఆంధ్రుల కీర్తి కిరీటము ...
పద్మశ్రీ Dr నందమూరి తారక రామారావు గారు
మన తెలుగు జాతికే గర్వకారకము !!
సాంఘిక,పౌరాణిక,జానపద,చారిత్రకాలలో నటించటమే కాక
,విభిన్న పాత్రలలో సహభాష్ అనిపించుకున్న మేటి నటుడు మన నందమూరి !
రాముడైనా రావణుడైనా
కృష్ణుడైనా ,దుర్యోధనుడైనా...అర్జునుడైనా ,ఆఖరికి భీష్ముడైనా
అద్భుతంగా నటించి... సాటిలేనిమేటి అనిపించుకున్న
సాటిలేని మేటి నటుడు మన ఆంధ్రులుద్దుబిడ్డ...!
వరదలు, కరువు కాటకాలలో ,ప్రజలకోసం తమమిత్రబృందం తో
కలిసి జోలిపట్టి చందాలు వసూలు చేసిన ఉదారస్వభావుడు మన
N t r ...!
అప్పటి నిరంకుశ కాంగ్రెస్ పాలనకు ,వ్యతిరేకంగా ప్రజల పక్షం వహించి...
* తెలుగుదేశం * అంటూ రాజకీయ ప్రాంతీయ పార్టీని స్థాపించి,
అతి తక్కువ కాలంలో...రాష్ట్రానికి ముఖ్యమంత్రియై
చరిత్ర సృష్టించిన ఏకైక నాయకుడు మన నందమూరి !!
చక్కని సంస్కరణలతో పాలనసాగించి ...
పేరుతెచ్చుకున్న చరిత్రపురుషుడు...!
మంచిపేరైనా,పతనమైన..
పురుషునికి స్త్రీ మూలముననే అని మరొక్కమారు
రుజువుచేసింది అతని జీవితం..!!
వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్టు
అతనికి చేతుకాలము దాపురించబట్టే...
వివేకానందుని వేశధారణతో ప్రవర్తించటం ...
స్త్రీ వలె చీరను ధరించి,మంచముక్రింద
శయనించటం లాంటి పిచ్చిపనులు...!
ఆహా విధి బలీయము కదా...!!
బలహీనతలు మానవ సహజమే , యే ఒక్కరూ అతీతులు కాలేరు !
తన ఆరోగ్యపరిస్థితులు అనుకూలించక,
అంతపెద్ద కుటుంబమున్నా నిరాదరణకు గురై...,
అభిమానము సేవల పేరుతో చేరువైన
మహిళను అభిమానించి ఇష్టపడటం తప్పుకాదు...
వివాహము చేసుకోవటమూ తప్పుకాదు...!
జరిగిన పొరపాటల్లా ...,
ఆమెను ఇంటికే పరిమితం చెయ్యకుండా....
అతని మొత్తంరాజకీయ కార్యకలాపాలలో ప్రాధాన్యతను కలిగించటం !
అదే అతని జీవితపత నానికి ఆరంభమైంది...!
ఒక జీవితకాలం శ్రమించి సాధించిన
పేరుప్రఖ్యాతులకు గొడ్డలిపెట్టయిపోయింది !!
ఆయన చేసినవి పొరపాట్, తప్పులే నని ప్రజలు తలచబట్టే....
అంతవ్యతిరేక తిరుగు బాటు వచ్చినా,
యే ఒక్కరూ అతనిని సమర్థించలేదు...!
ఇది ప్రజల వివేకానికి తార్కాణమే...!!
ఆఖరికి తీవ్ర ఒత్తిడి , మానసిక క్షోభలతో ...
అంతటి మహావ్యక్తి తనువు చాలించటం శోచనీయం ,
ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం !!
ఒక గొప్పవ్యక్తి జీవితం ఆరకంగా ముగిసిపోవటం...
ముందుతరాలకు ఓ గొప్ప పాఠం...!
మనిషన్నవాడు ఎలా బ్రత కాలో...ఎట్టిపరిస్థితుల్లోనైనా
ఎలాంటిపొరపాట్లు చెయ్యకూడదో,తెలియజేసే
ఆతని జీవితమే ప్రపంచానికి విశిష్టమైన పాఠ్యాంశం..!
ఏది ఏమైనా.... నందమూరి తారక రామారావుగారంటే...
తెలుగు ప్రజలకు చిరస్మరణీయుడే...!
ఆరాధ్యుడే...!!
అత్యంత అభిమాన పాత్రుడే.....!!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి