అత్యంత ఆదరణ పొందిన పుష్పరాజం.: - తాటి కోల పద్మావతి

 యూరోపియన్లను అత్యధికంగా ఆకర్షించిన పుష్పరాజం. ట్యూబ్ ఇవి ఘంటా కృతిలో వివిధ వర్ణాల్లో ఉండే ఈ పుష్పాలు సుమారు 400 సంవత్సరాల క్రితం మొదటిసారిగా టర్కీ వారు, యూరోపియన్లకు పరిచయం చేశారు. ఐరోపా ఖండంలో దీనికి లభించినంత ఆదరణ మరే పుష్పానికి లభించలేదని చెప్పాలి. సాధారణమైన టూలిప్ మొక్కల కోసం కూడా కొన్ని లక్షల సొమ్మునైన అక్కడ వెచ్చిస్తారంటే ఆశ్చర్యమే కదా! అరుదుగా లభించే ట్యూలిప్ మొక్క కోసం ఒకరు 12 ఎకరాల పొలాన్ని మరొకరు ఓ మిల్లును వదులుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. గత శతాబ్ద కాలంగా ట్యూలిప్ మొక్కల ఆకర్షణ ఐరోపావాసులకు రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. 
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తులిప్ ఉద్యానవనాన్ని ప్రారంభించింది దీనికి అపూర్వమైన స్పందన లభించింది. వచ్చే ఏప్రిల్ నాటికి వికసించేలా 15 లక్షల తులిప్ మొగ్గలను ప్రత్యేకంగా హాలండ్ నుంచి తెప్పించనున్నారు. చే ష్యా షాహీ పట్టణానికి దగ్గరలో హెక్టర్ ప్రాంతంలో ఉన్న ఈ ఉద్యానవనాన్ని ఐదు హెక్టార్ల మేరకు విస్తరించనున్నారు. అలాగే 17.5 హెక్టార్ భూమిలో మరో తులిప్ ఉద్యానవనాన్ని జమ్ములోనే మిరన్ సహాబ్ ప్రాంతానికి దగ్గరలో బోరీ క్యాంపు వద్ద ఏర్పాటు చేశారు. 

కామెంట్‌లు