దేవునికి మనిషి వేసే ప్రశ్న:- పైడి రాజ్యలక్ష్మి
 భగవంతుడివైన నీవు
సర్వత్రా నిండిఉండి
సర్వం నీవేఅయి…
ఈ సృష్టి చిత్రాలను నడిపి
పాపపుణ్యాలను మాకు
కట్టబెడతావు కదా?
ఏమయ్యా…!
వీటిని నీవు మార్చవచ్చు కదా
మనిషిని మనీషిగా మలచవచ్చు కదా…
అని ప్రశ్నిస్తాడు !
వెంటనే భగవంతుడు ఒక ఓరచూపు చూసి
మనిషివి మనీషివి అయిపోతే
ఈ జగన్నాటకానికి తెరపడిపోదూ…!
అని కళ్ళతో నవ్వి కదలిపోతాడు
వాడు కాలాంతకుడు… మరి…!

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Very nice question.
అజ్ఞాత చెప్పారు…
chala chala baaga chrpparu manasu nundi vachi matalu.
అజ్ఞాత చెప్పారు…
ఆలోచింప చేసే కవిత
అజ్ఞాత చెప్పారు…
ధన్యవాదాలండి నా కవిత నచ్చినందుకు 🙏🙏🙏
అజ్ఞాత చెప్పారు…
చాలా సంతోషమండి నా కవితను మెచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు
ధన్యవాదములండి