వాళ్ల చేతులు చూడు కాయలు కాచాయ్
వాళ్ల కాళ్లు చూడు బొబ్బలు రేగాయి. వాళ్ల మొహం కష్టాలకు దర్పణం
కానీ వాళ్ల హృదయం నిర్మలం. అందుకే
నువ్వు నేను అంతస్తులపైన అంతస్తులు కడుతున్నా మన కట్టడాలకు వాళ్ల కష్టాన్ని
ధారబోస్తున్నారు.
మనం ఇచ్చే కాసులకు గంజి కూడా రాకపోయినా
కాళ్ళు ముడుచుకొని పడుకుంటారు.
కష్టజీవుల రుణం
తీర్చుకొందాం.
విశాలమైన భవన నిర్మాణ కర్తలు,
భవన శుభ్రతను,రక్షణను చూచే భవన పరిరక్షకులకు తమ చెంతనే నివాస వసతి వీలున్నంత కల్పించితే
కష్టజీవుల కడగళ్ళు కొంతమటుకు
గట్టిక్కుతాయి. మే డే రోజు ఏదో ఒక మేలు
గలిగిస్తే పేదల హృదయాలు పులకరిస్తాయి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి