నేను సైతము
సమాజ శ్రేయస్సుకు
చెమటచుక్కలు రాల్చాను
శ్రమించాను శ్రద్ధచూపాను
నేను సైతము
సాహితీ సేవకు
సమ్మేళనాలు నిర్వహించాను
శాలువాలుకప్పాను సత్కారాలుచేశాను
నేను సైతము
కష్టపడి
అక్షారాలు అల్లాను
పదాలుపేర్చాను విషయాలువెల్లడించాను
ఏను సైతము
సరస్వతీ పుత్రునిగా
సుకవితలు వ్రాశాను
సూక్తులుచెప్పాను చిత్తాలుదోచాను
నేను సైతము
తలనందు
తలపులు పారించాను
తహతహలాడించాను తృప్తినిపంచిపెట్టాను
నేను సైతము
అనాధలకు
అండగా నిలిచాను
ఆర్ధికసాయమందించాను ఆదుకున్నాను
నేను సైతము
అన్యాయాక్రమాలను
అడ్డుకున్నాను
అణచివేశాను అదుపుచేశాను
నేను సైతము
అందరి ఆహ్లాదానికి
అందాలు చూపాను
ఆనందంకలిగించాను అంతరంగాలుమీటాను
నేను సైతము
పర్యావరణశుద్ధికై
మొక్కలు నాటాను
తోటలుపెంచాను పువ్వులుపూయించాను
నేను సైతము
పాఠకులయొక్క
మదులుతట్టాను
హృదులుముట్టాను మనసుల్లోనిలిచాను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి