కార్మికుల గీతం:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.ఎం. ఏ (ఇంగ్లీష్ ); డి. ఎడ్.
గీత కార్మికులు, తాటి చెట్టు రాగం,
కల్లు తీసే సృజన జీవన భాగం.

నేత కార్మికులు, దారాల అందం,
చీరలో చేనేత జీవన ఛందం.

బీడీ కార్మికులు, చిన్న కిరణం,
చెమటలో ధగధగ జీవన జ్వలనం.

పారిశుధ్య కార్మికులు, పవిత్ర హస్తం,
ఊరు సుగంధ జీవన శాస్త్రం.

వ్యవసాయ కార్మికులు, నేల హృదయం,
పంటలో సమృద్ధి జీవన నిధియం.

నిర్మాణ కార్మికులు, రాయి సంగీతం,
ఇటుకలో కలల గుండె గమకం.

కర్మాగార కార్మికులు, యంత్ర నాదం,
శ్రమతో జాతి హృదయ స్పందం.

కుటీర కార్మికులు, సౌమ్య కళామం,
చేతితో చెక్కిన సంస్కృతి ధామం.

ఓ కార్మికులారా, జగతి ఆధారం,
మీ చెమటలోనే లోక సంసారం.
మీ శ్రమ గీతం, 
కష్టం కావ్యం,
కార్మిక దీప్తితో జాతి ధ్యేయం!
________


కామెంట్‌లు