అమ్మా!నీవే భూమివై నాకు జన్మనిచ్చిసహనంతో పెంచిఒడిలో ఉనికి నిలిపిజీవనాధారమయ్యావు.అమ్మా!నీవే జలమైనా ప్రాణాన్ని నిలిపినా హృదయాన్ని ఆర్ద్రo చేసినన్నొక శాంతిమంత్రాన్ని చేసావు.అమ్మా!నీవే నాలో అగ్గివైజఠరాగ్ని రగిల్చిచీకటి గహనాల్లోకాంతి దీపమైధైర్యపథాన్ని చూపావు.అమ్మా!నీవే వాయువైనా శ్వాసలో ఆడిజీవనగీతాన్ని పాడిజీవనమూలానివయ్యావు.అమ్మా!నీవే నింగివైప్రేమతో నన్నావరించిఅనంత ఔదార్యాన్ని నింపినా స్థితికి నిరంతర రక్షగా నిలిచావు.అమ్మా!నువ్వే నాకు సర్వం.జీవికలో గర్వం.బతుకుమూలానికి మర్మం.________
అమ్మా !నీవే పంచాక్షరి ..:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.-ఎం. ఏ (ఇంగ్లీష్ ) & డి. ఎడ్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి