సీతారామ శాస్త్రి గారి సాహితీ కలం,
పాటలలో పరిమళించే "సిరివెన్నెల" గళం.
'అన్వేషణ' లో ఆలోచన రాగమై,
'ఆది భిక్షువు’ లో జీవన సత్యమై,
‘స్వాతి ముత్యం’ లో స్వచ్ఛమైన స్వరమై,
'గీతాంజలి’ లో ప్రేమగీతమై,
‘రుద్రవీణ’ లో తరలిరాదా తనే వసంతమై.
‘స్వర్ణకమలం’ లో కవిత్వ గంధమై,
ఎంతవరకు ఎందుకొరకు అని నిర్దేశించే 'గమ్య' మై
మనసును హత్తుకొనే సాహితీ సౌరభమై
నంది అవార్డులందుకున్న ఘనాపాటి,
ఫిల్మ్‌ఫేర్ తో ఆయనకు లేరు పోటీ,
తెలుగు జన హృదయాలు గెలుచుకోవడంలో ఆయనకెవరు రారు సాటి.
సిరివెన్నెల కలానికి నీరాజనంగా
సాహితీ లోకానికి వెన్నలలద్దిన చంద్రికగా
పద్మశ్రీ సత్కారం ఆయనను వరించెనుగా.
_________________________________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి